కేసీఆర్ ఛాంబర్‌లో మంత్రి తుమ్మల..

by Gantepaka Srikanth |

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నూతనంగా నిర్మించిన టీజీ ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ను కోరారు.

కేసీఆర్ ఛాంబర్‌లో మంత్రి తుమ్మల..
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నూతనంగా నిర్మించిన టీజీ ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ను కోరారు. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఛాంబర్‌కు స్వయంగా వెళ్లి కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం జరుగనుంది.

కాగా, నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం నిర్మించింది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు. ఈ ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు.. రిఫైనరీని పెట్టి తుది ఉత్పత్తి ఇకడి నుంచే నేరుగా మారెట్‌లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్‌పామ్‌ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్డ్‌ చేసి పామాయిల్‌ను ప్యాకెట్స్‌ రూపంలో మార్కెట్‌లోకి తెస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆయిల్‌పామ్‌ గెలల నుంచి వెలువడే బయోమాస్‌ వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. 4 మెగావాట్ల సెల్ఫ్‌ జనరేషన్‌ విద్యుత్తుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క యూనిట్‌కు రూ.1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్తు ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనున్నది. వాడిన నీటిని వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ ద్వారా రీ సైకిల్‌ చేసే పద్ధతి కూడా ఉన్నది. ఈ ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్‌ సామర్థ్యం, గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్‌ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్‌ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశంలోనే తొలిసారి.

Next Story