- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GOOD NEWS: సంక్రాంతి వేళ రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త
రేషన్ కార్డులు(Ration cards), ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డులు(Ration cards), ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన నిరుపేదలను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రేషన్ షాపుల్లోనే సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఇక నుంచి బియ్యం అమ్ముకునే పరిస్థితి ఉండబోదు అని అన్నారు. ఇళ్లు లేని వారిని గుర్తించి మంజూరు చేయాలని సూచించారు. నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దక్కాలని అన్నారు. ఈనెల 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు పడతాయని సంక్రాంతి(Sankranti) వేళ శుభవార్త చెప్పారు. తప్పుడు లెక్కలు రాస్తే అధికారులపై చర్యలు తప్పవని అన్నారు.
ప్రజల కోసం ఉన్న అన్ని భవిష్యత్తు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. రోడ్డు మార్గాల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు కల్పించడం తదితర అంశాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన, ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, మౌలిక వసతులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.






