Minister Tummala: అర్హత ఉన్న అందరికీ రైతుభరోసా అందాలి

by Gantepaka Srikanth |
Minister Tummala: అర్హత ఉన్న అందరికీ రైతుభరోసా అందాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో అర్హత కలిగిన రైతు నష్టపోకుండా రైతుభరోసా అందేవిధంగా సర్వే జరగాలని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సాగుకు అనువుగాని భూములను గుర్తించి, మంగళవారం నుండి జరిగే గ్రామసభలలో వాటి వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సోమవారం జిల్లా వ్యవసాయాధికారులతో రైతుభరోసా పథకం అమలు, సర్వే జరుగుతున్న తీరు గురించి వీడియో కాన్పరెన్స్​ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదే సమయంలో కొత్తగా చేరిన పట్టాదారుల బ్యాంకు వివరాలను ఎఈఓలు నమోదు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని, మండల వ్యవసాయాధికారులు వాటిని ధృవీకరించి అప్ లోడ్ చేయాల్సిందిగా ఆదేశించారు.

అనంతరం వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు వివరిస్తూ అప్ లోడ్ చేసే సందర్భంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తెలియచేయాలని, ప్రభుత్వం జనవరి 26 నుండి రైతుభరోసా వర్తింపజేస్తుందన్నారు. సర్వే చేసిన వివరాలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయించాల్సిన బాధ్యత, పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా వ్యవసాయాధికారులు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ సంచాలకులు గోపి, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed