Thummala : దక్షిణాది మంత్రులతో మంత్రి తుమ్మల చర్చలు.. ఎందుకంటే?

by Ramesh Naini |

నలుగురు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో రాష్ట్ర మంత్రి తుమ్మల సంప్రదింపులు చేపట్టారు.

Thummala : దక్షిణాది మంత్రులతో మంత్రి తుమ్మల చర్చలు.. ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Minister Tummala Nageswara Rao) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. (oil palm cultivation) ఆయిల్ పామ్ సాగుదారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో (South Ministers) నలుగురు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో రాష్ట్ర మంత్రి తుమ్మల సంప్రదింపులు చేపట్టారు. ఆయిల్ పామ్ దిగుమతులపై ప్రస్తుత కస్టమ్స్ డ్యూటీని పెంచాలన్న అంశంపై ఈ చర్చలు జరిగాయని మంత్రి తాజాగా ఒక ప్రకనటనలో తెలిపారు. ప్రస్తుతం కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్‌లో చౌకగా దిగుమతి ఆయిల్ లభిస్తోందన్నారు. దీనివల్ల ఆయిల్ పామ్ ఉత్పత్తి చేస్తున్న దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులకు మాత్రం లాభాలు కలుగుతున్నాయని, ఇది రైతులకు అన్యాయం చేస్తోందని మంత్రి వెల్లడించారు.

ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని మంత్రి భావించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు ఆయన వ్యక్తిగతంగా లేఖలు పంపారు. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న డిమాండ్‌తో కేంద్రాన్ని కలవాలని, రైతుల పక్షాన గళం వినిపించాలని మంత్రి కోరారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో ప్రత్యక్షంగా సమావేశమై, ఆయిల్ పామ్ సాగు దారులకు అనుకూలంగా దిగుమతి విధానాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఆయిల్ పామ్‌కు మినిమమ్ గ్యారంటీ ప్రైస్ (MGP) రూ.25 వేలుగా నిర్ణయించాల్సిన అవసరాన్ని కూడా మంత్రి లేఖలో ప్రస్తావించారు. గతంలో మాదిరిగా క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుబడి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరారు. రైతుల హక్కులు, వారి జీవనోపాధి రక్షణ, దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

Next Story