- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేనేత భవన్‌లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ.. టైమ్‌కు రాని ఉద్యోగులపై ఆగ్రహం.. చర్యలకు ఆదేశాలు
by Ramesh Naini |
హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న మంత్రి, కొంత మంది ఉద్యోగులు ఇంకా హాజరు కాలేదని గమనించారు.
దీంతో మంత్రి తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఆలస్యంగా వచ్చిన వారందరికీ మెమోలు జారీ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని హెచ్చరించారు.
Next Story






