TG: రైతాంగానికి మహర్దశ

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-20 10:25:35  IST  )

గ్రామీణ భారతావణి అభివృద్ధికి సంస్కరణలు నూతన ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు.

TG: రైతాంగానికి మహర్దశ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ భారతావణి అభివృద్ధికి సంస్కరణలు నూతన ఆవిష్కరణలతో బాటలు వేయొచ్చని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు. గురువారం హైదరాబాద్ హైటెక్స్‌లో నాబార్డ్(NABARD) మరియు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల ఎర్త్ సమ్మిట్ సదస్సులో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు చెప్పారు. గ్రామీణ భారత దేశంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్న నాబార్డ్ సేవలు అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్స్‌కు సమ్మిట్ బాటలు వేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌పీ‌ఓలు స్టార్టప్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. మారిన వాతావరణ మార్పులకు తగ్గట్టుగా ఆవిష్కరణలు జరగాలి, అందుకోసం మార్కెటింగ్ కో-ఆపరేటివ్‌తో పాటు అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు పాలనా సంస్కరణలతోనే సాధ్యమని, భారత రైతాంగానికి మరియు నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా నాబార్డ్ చేపట్టిన ఎర్త్ సమ్మిట్‌కు ప్రభుత్వ పక్షాన మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ, డిప్యూటీ ఎండీ గోవర్ధన్ సింగ్ రావత్, డాక్టర్ అజయ్ కుమార్ సూద్ పాల్గొన్నారు.

Next Story