- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ సేవలు
ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ కు విశేష స్పందన వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ కు విశేష స్పందన వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో మంత్రి పోస్ట్ చేశారు. రెండు రోజుల్లో యాప్ ద్వారా 60,510 యూరియా బస్తాల కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. 19,695 మంది రైతులు యాప్‌లో బుకింగ్ చేసుకున్నారని పేర్కొన్నారు. 217 మంది కౌలు రైతులు 678 బస్తాలు బుకింగ్ చేసుకున్నట్టు తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాప్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రారంభంలో వచ్చిన టక్నికల్ సమస్యలను గుర్తించి దానిని పరిష్కరించామని చెప్పారు.
రబీ సీజన్ కోసం ఇప్పటికే రాష్ట్రానికి 5లక్షల 30వేల మెట్రిక్ టన్నుల యూరియా అందినట్టు తెలిపారు. జనవరి ఫిబ్రవరిలో యూరియా డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో దానికి తగినట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ యాప్ ను మొదట పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్, జనగామ, మహబూబ్నగర్,నల్గొండ, పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు.






