- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెలలో 1.84 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా సరఫరా అయ్యింది: మంత్రి తుమ్మల
రాష్ట్రానికి యూరియా సరఫరా ఈ సెప్టెంబర్‌లో గత నెలల కంటే ఎక్కువ రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి 7.88

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి యూరియా సరఫరా ఈ సెప్టెంబర్‌లో గత నెలల కంటే ఎక్కువ రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందగా, వీటిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా కావడం చాలా గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదే పదే కేంద్రాన్ని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడంతో ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందని తెలిపారు. ఏప్రిల్ నెలలో 1.21లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో 0.88, జూన్ నెలలో 0.98, జులై నెలలో 1.43, అగస్టు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనుకాడకుండా రైతుల అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు.
ఆగస్టు నెలలోనే సెప్టెంబర్ కేటాయింపుతో పాటు అప్పటి వరకు ఏర్పడిన లోటును కూడా భర్తీ చేసేలా యూరియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, దానికి అనుగుణంగానే సెప్టెంబర్ మాసంలో కేటాయించిన 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 25వ తేదీ వరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి అందాయని చెప్పారు. రేపటి నుంచి వరుసగా సీఐఎల్ గంగరవరం, ఎన్ఎఫ్ఎల్వైజాగ్, ఐపీఎల్జూపిటర్, ఇఫ్కో నర్మదా,ఎన్బీసీఎల్సిమ్పోనీ, సీపిఐసీ కంపెనీల నుండి మరో 9864 మెట్రిక్ టన్నులు, 9674 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు.
ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన వరంగల్, మంచిర్యాల, గద్వాల, కరీంనగర్, పందిళ్లపల్లి, జడ్చర్ల, తిమ్మాపూర్ ప్రాంతాలకు చేరుకుంటుందని, అక్కడి నుండి జిల్లాలకు సరఫరా అవుతుందని వివరించారు. ఎన్ఎఫ్ఎల్మంగళూరు, సీఐఎల్గ్రేస్, ఐపీఎల్గంగవరవం, జూపిటలర్, ఐపీఎల్రేక్గ్రేస్, స్పేసిక్క్రిబోకో, ఐపీఎల్జూపిటర్, ఎన్బీసీఎల్ వాడి, సీఐఎల్రూబీ కంపెనీల నుండి మరో 34,700 మెట్రిక్ టన్నుల యూరియా రేక్ ప్లాన్ ఉందని, ఇది ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి చేరుకునే అవకాశం చెప్పారు. గత ఖరీఫ్ సీజన్‌లో 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిందిని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలకు 9.50 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేశామని వెల్లడించారు.
రబీ సీజన్‌కు ముందస్తు ప్లాన్సిద్దం :
రానున్న రబీ సీజన్ కు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రబీ సీజన్ కు వాస్తవ ప్రణాళిక 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఖరీఫ్ లో జరిగినట్టుగా రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే రబీ సీజన్ మొదటి 3 నెలలలో 6 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని పేర్కొన్నారు. రైతుల అవసరాల దృష్ట్యా యూరియా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని హామీ ఇచ్చారు.






