రాష్ట్రంలో రానున్న 3 సంవత్సరాలలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు: మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

సకాలంలో విధులకు రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. వ్యవసాయశాఖ కింద ఉన్న అన్ని శాఖలు ,కార్పోరేషన్లు సంబంధించిన ఉద్యోగులు సకాలంలో హాజరయ్యేట్టు అన్ని శాఖల వివరాలు రోజువారిగా లైవ్ అప్డేట్ ఉండే విధంగా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి ఆదేశించారు.

రాష్ట్రంలో రానున్న 3 సంవత్సరాలలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : సకాలంలో విధులకు రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. వ్యవసాయశాఖ కింద ఉన్న అన్ని శాఖలు ,కార్పోరేషన్లు సంబంధించిన ఉద్యోగులు సకాలంలో హాజరయ్యేట్టు అన్ని శాఖల వివరాలు రోజువారిగా లైవ్ అప్డేట్ ఉండే విధంగా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి ఆదేశించారు. బుధవారం ఉదయం 10.30 కు తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని ఆకస్మిక తనికీ చేపట్టారు. ఈసందర్భంగా ఆయిల్ ఫెడ్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 సంవత్సరాలలో 10 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు పెంచాలని, అన్ని ఉమ్మడి జిల్లాలలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగార నిర్మాణ పనులు పూర్తి కాగా, ఖమ్మం జిల్లా కల్లూరుగూడంలో, గద్వాల జిల్లా బీచుపల్లిలో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్పల్లిలో, ఖమ్మం జిల్లా అంజనాపురం లో, ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయిల్ పాం నర్సరీలలో అధిక దిగుబడినిచ్చే తక్కువ ఆకు నిడివి గల, తక్కువ ఎత్తు పెరిగే మేలైన రకాలను పెంచాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి అనుభవం ఉన్న కంపెనీలతో మాట్లాడి శాస్త్రవేత్తల సూచనలతో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ నర్సరీలలో రానున్న సంవత్సరాలలో డిమాండుకు అనుగుణంగా 10 లక్షల మొక్కలు పెంచాలని సూచించారు.

సిద్దిపేటలో ఎలాంటి కాలుష్యానికి తావులేని అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేత ఓపెనింగ్ కు సిద్ధంగా ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని జిల్లా కలెక్టర్లు , వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారుల సమన్వయంతో ప్రతి జిల్లా లో రివ్యూ చేసి ఆయిల్ ఫామ్ సాగుకు విస్తీర్ణం పెరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. సరైన పురోగతి లేని ప్రైవేట్ ఆయిల్ ఫామ్ కంపెనీలపై తగు చర్యలను తీసుకోవాలని వీలైతే ఆ కంపెనీ లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. విజయ్ హైదరాబాద్ ఎడిబుల్ ఆయిల్స్ అన్ని జిల్లాల్లో సేల్స్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి అనుగుణంగా నిర్మితమవుతున్న మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలి నాణ్యమైన వంట నూనెలను రాష్ట్ర అంత అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ ఫెడ్ లో త్వరలోనే కొత్త ఉద్యోగస్తుల నియమాకాలతో బలోపేతం చేస్తామని వెల్లడించారు.

Next Story