- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ముందస్తుగా తీసుకోవల్సిన చర్యలపై అన్ని జిల్లాలల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా తీసుకోవల్సిన చర్యలపై అన్ని జిల్లాలల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా ముందస్తుగా తెలియజేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు, పంటలకు వచ్చిన ముప్పేమి లేదని, ఒకవేళ భారీగా వర్షాలు పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తుమ్మల తెలిపారు. ఈ సందర్భంగా యూరియాపై సీఎం రేవంత్రెడ్డి వివరాలు అడగగా రెండు రోజుల నుంచి మాత్రమే రామగుండం నుండి యూరియా సరఫరా మొదలైందని, రోజుకు ఒక రాక్యూరియా సరఫనా చేస్తున్నారని, దానిని డిమాండ్ ఉన్న జిల్లాలకు పంపించడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే తాను నాలుగు సార్లు, స్వయంగా ముఖ్యమంత్రి నాలుగు సార్లు కేంద్ర ఎరువులు, రసాయనలు శాఖ మంత్రి నడ్డాను కోరిన, కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. నాలుగు నెలల నుండి వారు కేటాయించిన విధంగా ఎప్పుడూ పూర్తిగా సరఫరా చేయలేదని, మన దగ్గర ఉన్న బఫర్ స్టాక్ తోనే ఇప్పటివరకు సర్ధుబాటు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలలో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుందని, వరి నాట్లు కూడా 15 వరకు అయిపోతాయని, యూరియా ధరలు తక్కువగా ఉండటంతో కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరత ఉందని, కేంద్రం నుండి అవసరం మేరకు యూరియా రాకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఢిల్లీలోని మన రాష్ట్ర ఎంపీలను కేంద్ర మంత్రి జెపి నడ్డా ను కలిసి మరోసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా గురించి అడిగేవిధంగా సూచించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.






