- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఇచ్చిన వాంగ్మూలం అసత్యాలతో కూడుకున్నదని ఆయన అన్ని అబద్ధాలు చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవదూరంగా ఉన్నాయన్నారు. వాంగ్మూలం ఈటల అనాలోచితంగా ఇచ్చారా? లేదంటే ఆ రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆయనకు ఏమైనా దాపురించాయా అని కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన తుమ్మల.. కాళేశ్వరం వివాదంలోకి నన్ను లాగుతున్నారని తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని మండిపడ్డారు. ఈటల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులు ఇచ్చాక15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండిగ్ ప్రాజెక్టులు ఎస్టిమేషన్ రేట్లకే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేస్తారా? పనులు చేస్తే ఏం చేయాలి? చేయకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశంపై సబ్ కమిటీ వేశారని చెప్పారు. ఈ కమిటీ కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని ఈ ప్రాజెక్టుపై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదన్నారు. కేబినెట్ అఫ్రూవల్ కు కాళేశ్వరం (Kaleswaram Project) ప్రాజెక్టు ఎప్పుడు రాలేదని ఇది కేబినెట్ అప్రూవల్ పొందలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంబంధం లేదని నేను సుమోటోగా జస్టిస్ పీసి కమిషన్ (Justice PC Ghosh Commission) ముందుకు వెళ్తానని, కమిషన్ దృష్టికి వివరాలన్నీ తీసుకువెళ్తానని తుమ్మల స్పష్టం చేశారు.






