- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు భూసార పరీక్షలు చేసుకునే వెసులు బాటు కల్పించాలి: మంత్రి తుమ్మల
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఎలా అమలు చేయాలో తెలుసుకొని, కేంద్రం తలపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈనెల 29 నుంచి 2 జూన్ వరకు జరిగే కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొనాలని

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఎలా అమలు చేయాలో తెలుసుకొని, కేంద్రం తలపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈనెల 29 నుంచి 2 జూన్ వరకు జరిగే కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొనాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో అవసరమున్న రైతుకు మట్టి నమూనా పరీక్ష చేసుకొనే వెసులుబాటు కల్పించాలని డైరెక్టర్ గోపికి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీ ద్వారా ప్రతీ రెవెన్యూ గ్రామాలలో ముగ్గురు ఎంపిక చేసిన రైతులకు మూల విత్తనాలను (ఫౌండేషన్ సీడ్) ఇవ్వడానికి, డిపార్ట్ మెంట్ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
మూలవిత్తనం సరఫరా చేసిన రైతుల పొలాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులకు తిరిగి చేరేవిధంగా చూడాలని, అప్పుడే కార్యక్రమం లక్ష్యం నేరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈసందర్బంగా మంత్రి తుమ్మలతో సమావేశమైన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వివరిస్తూ సహకార రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం దిశగా చర్చలు చేపట్టడానికి అనువుగా ఈ సమావేశం నిర్వహించుకోవాలని తెలిపారు. అదేవిధంగా మట్టి నమూనా ఫలితాలు ప్రతీ రైతుకు అందించేటందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి తగ్గ విధివిధానాల రూపకల్పన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.






