- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala: చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ధన్యవాదాలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం (handloom day) సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో (People's Plaza) ఇవాళ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 17 వరకు ఈ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఈ సందర్భంగా చేనేత స్టాళ్లను, చేనేత ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని వస్త్రాలను మంత్రి పరిశీలించి అభినందించారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు ఎన్నికైన వారు తయారుచేసిన ఉత్పత్తులను మంత్రి పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగో, త్రిలింగా చీరను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. అంతరించిన పోతున్న చేనేత కళలన్నింటికి పునర్వ వైభవం తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని అందులో భాగంగా రెండు సంవత్సరాల కాల వ్యవధితో నేతన్న పొదుపు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మరణించిన చేనేత కుటుంబానికి అండగా ఉండేలా నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన కుటుంబ నామినికి రూ.5 లక్షలు అందజేస్తున్నామన్నారు. మార్చిలో ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా చేనేత రుణమాఫీ కోసం 33 కోట్లు విడుదల చేశామన్నారు.






