- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జులైలోగా ఎరువులు సరఫరా చేయాలి
వివిధ విత్తన కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి జిల్లాల వారిగా అన్ని రకాల విత్తనాల లభ్యత, కొనుగోళ్ల వివరాలను ఆరా

ఎరువులు తక్కువగా సరఫరా చేసిన కంపెనీలు జులై లోగా సరఫరా చేయాలి
అన్ని మండలాలలో రైతుల సరిపడ ఎరువులు అందుబాటులో ఉంచాలి
జిల్లా వారిగా కేటాయించిన ఎరువులను, ఆ జిల్లాలలోనే పంపిణీ జరగాలి
కల్తీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి : అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో : కంపెనీలు తమకు ఇచ్చిన టార్గెట్కంటే తక్కువగా సరఫరా చేసిన ఎరువులను జులై లోగా సరఫరా చేయాలని ఎరువుల కంపెనీల ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మార్క్ ఫెడ్ , వ్యవసాయశాఖ, ఎరువుల కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు1.22 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు 0.87 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంపై కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ నెలకు కేటాయించిన 1.70 లక్షల మెట్రిక్ టన్నులతో పాటు ఇప్పటివరకు తక్కువగా సరఫరా చేసిన 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను జూలై నెలలోగా సరఫరా చేయాలన్నారు. ఒకవేళ కేటాయించిన ఎరువులను సరఫరా చేయని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లావారిగా కేటాయించిన ఎరువులను, ఆ జిల్లాలలోనే పంపిణీ చేసేలా కంపెనీలు కూడా జాగ్రత వహించాలని సూచించారు. అన్ని మండలాలలో రైతుల అవసరాలకు తగ్గట్టు ఎరువుల ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రతి జిల్లాలోను కేవలం ఈ నెలకు సరిపడ ఎరువులనే కాకుండా, వచ్చే నెలకు సరిపడ ఎరువులను కూడా ముందస్తుగానే జిల్లా కేంద్రంలో నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవలన్నారు. రోజువారి కొనుగోళ్లను కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ఒకవేళ డీలర్లు ఈపాస్ద్వారా అమ్మకాలు జరపకుంటే ఆయా మండలాలలో ఉన్న నిల్వలు తెలుసుకునే అవకాశం ఉండదని, అటువంటి డీలర్లు, వారికి ఎరువులు సరఫరా చేసే కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవల్సిందిగా డైరెక్టర్ కు సూచించారు.
సన్న రకాల వరి విత్తనాల లభ్యతపై దృష్టి పెట్టాలి
వివిధ విత్తన కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి జిల్లాల వారిగా అన్ని రకాల విత్తనాల లభ్యత, కొనుగోళ్ల వివరాలను ఆరా తీశారు. సన్న రకాల విత్తనాలు, పౌరసరఫరాల శాఖ కొనుగోలుకు అనువుగా ఉన్న రకాల లభ్యతపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. వెంటనే డైరెక్టర్ గోపి వివరణ ఇస్తూ అన్ని రకాల విత్తనాలను ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామని, 1.37 కోట్ల ఎకరాలకు సరిపడ వరి విత్తనాలు, సన్న రకాలు 24 లక్షల క్వింటాళ్లు, దొడ్డు రకాలు 10 లక్షల క్వింటాళ్లు విత్తనాలు, మొక్కజొన్న 6 లక్షల ఎకరాలలో సాగవుతుందని అంచనా వేసి 30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను, కందులు 44 వేల క్వింటాళ్లు, పత్తి 98 వేల క్వింటాళ్లు (2.17 కోట్ల ప్యాకేట్లు) సోయాచిక్కుడు 32 వేల క్వింటాళ్ల విత్తనాలను ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామని తెలిపారు.
అదే విధంగా కల్తీ విత్తనాల విషయంలో పోలీసు శాఖ వారితో టాస్క్ పోర్స్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే 13 జిల్లాలలో 46 కేసులు పెట్టి 111 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, 323.2 క్వింటాళ్ల కల్తీ విత్తనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలు మాట్లాడుతూ కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని, సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీలను కూడా సీడ్ చట్టం పరిధిలోకి తెచ్చి, విత్తనోత్పత్తి రైతులు నష్టపోయిన సందర్భాలలో ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు సీడ్ యాక్ట్ ముసాయిదా సిద్ధం చేయాల్సిందిగా సెక్రటరీ రఘునందన్ రావుకు సూచించారు. వచ్చే నెలలో మిర్చి విత్తన కంపెనీలు, నర్సరీల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని రకాల విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






