- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలసదారుల, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని వలసదారులు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి జీవనోపాధి కోసం మొబైల్ వలస సహాయ కేంద్రం ప్రారంభించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శ

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వలసదారులు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి జీవనోపాధి కోసం మొబైల్ వలస సహాయ కేంద్రం ప్రారంభించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ, ఎప్ఏఓ సంయుక్త కార్యచరణగా రూపొందించబడిందని చెప్పారు. ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం నిజామాబాద్ ,నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్లుతున్న గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు సేవలు అందిస్తామన్నారు.
ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి, ఎంపికచేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరిక్షలు, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై, పశుపాలనపైన వర్చువల్ శిక్షణలు ఇవ్వాలని సూచించారు. ఇకపై ఈ వాహనాల ద్వారా మొబైల్ మట్టి నమూనా పరీక్షలు, పశుసేవల వంటి ఇతర సేవలు కూడా రైతులకు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. యుఎన్భాగస్వామ్య సంస్థల కృషిని ప్రశంసించారు. వలస వెళ్ళిన కుటుంబాలలో మహిళలు తరచూ ఇంటిలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటువంటి మహిళలకు గ్రామాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుంది. ఇది వారిని శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, ఎఫ్ఏఓకు చెందిన అగ్రిబిజినెస్ స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి, ఐఎంఓ రాష్ట్ర సమన్వయకర్త జలజ తదితరులు పాల్గొన్నారు.






