తెలంగాణలోని ఆ పథకం దేశాన్ని కదిలిస్తుంది: Talasani Srinivas Yadav

by GSrikanth |   (  Updated:2023-08-13 10:42:47  IST  )

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూడలేని కబోది పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని విమర్శించారు.

తెలంగాణలోని ఆ పథకం దేశాన్ని కదిలిస్తుంది: Talasani Srinivas Yadav
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూడలేని కబోది పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని విమర్శించారు. బీజేపీ ఆఫీస్ పక్కనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లున్నాయన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 45 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలతో ప్రజల్లోకి వస్తున్నారని, డ్రామాలు షురూ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం రానున్న రోజుల్లో దేశాన్నే కదిలిస్తుందని పేర్కొన్నారు.

Next Story