దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివృద్ధి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Dishafeatures2 |
దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివృద్ధి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ కొరియా తరహాలో తెలంగాణలోనూ పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం మంత్రితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా లోని ఇండియన్ అంబాసిడర్ అమిత్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో క్రీడల అభివృద్ధికి దక్షిణ కొరియా తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, చిల్డ్రన్స్ పార్కుల తరహాలో తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.


హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, బుద్వెల్, గండిపేట తదితర పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు కు దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివృద్ధి కోసం పూర్తి సహకారం అందజేస్తామని భారత అంబాసిడర్ అమిత్ కుమార్ వెల్లడించారు. క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటుకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed