కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌ పొత్తు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌ పొత్తు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని రాష్ట్ర మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఎల్బీ స్టేడియం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023లో మొదటి జోక్ అని ఎద్దేవా చేశారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ సింగల్‌గానే పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ సింగిల్‌గానే పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోలవరం విషయంలో కేసీఆర్ విశాల ధృక్పదంతో పనిచేస్తారని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఏం చదువుకోని వారిని హెల్త్ మినిస్టర్లను చేశారు, అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌తో అర్హులకే పదవులు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందని, చావడానికైనా చంపడానికి అయినా సిద్ధమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed