- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: వామనరావు హత్యకేసులో వారి హస్తం: శ్రీధర్ బాబు
వామనరావు హత్య కేసుపై శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వామనరావు దంపతుల హత్య కేసుపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వామనరావు దంపతుల హత్య కేసులో (Vamanarao murder case) పెద్దల హస్తం ఉందన్నారు. ఈ కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ కేసులో అసలు దోషులు బయటకు రావాలని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. ఇవాళ కరీంనగర్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మాకు ఎవరిపై వ్యక్తిగత కక్షలు లేవని అసలు దోషులు సీబీఐ విచారణలో బయటకు వస్తారన్నారన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఒప్పుకోం:
నీటి వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఒప్పుకోమని వృథాగా పోతున్న నీళ్ల విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద నీళ్లు వినియోగించుకోవచ్చని ఏదో వంక చెప్పి ప్రాజెక్ట్ కట్టాలని చూస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సిందేననని గత పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ సమయం వృథా చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని గత ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రాల రూపంలో రాష్ట్ర ప్రజలకు వివరించామన్నారు. రాష్ట్ర మంత్రులు కోరుతున్నా కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం అన్నారు.






