- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఆయన మిత్రుడు మోడీకే తెలుసు’: మంత్రి శ్రీధర్ బాబు సెటైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. H1B VISA పై ఛార్జీలు అమెరికా పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుందని అన్నారు. భారత దేశానికి నష్టం జరిగేలా అమెరికా నిర్ణయాలు ఉంటున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తున్న వారికి అమెరికా చాలా నష్టం కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. 1లక్ష డాలర్లు కట్టాలని అమెరికా రూల్ తెస్తే అమెరికాలో ఇండియా కంపెనీలకు తీర్వమైన నష్టం తప్పదని అన్నారు. H1B వీసాలో మొదటి స్థానంలో ఇండియా, తర్వాత చైనా ఉందని గుర్తుచేశారు. ట్రంప్ నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. H1B VISA దారులకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో చాలా మంది ఉన్నారు.. ఇక్కడ కుటుంబాలు వాళ్ళు పంపించే మనీ పైనే ఆధారపడి ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్ళాలి అనే యువతపై ప్రభావం పడుతుంది. రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోలు, ఇతరుల రంగాల్లో భారం పడుతుందని అన్నారు. మోడీ - ట్రంప్ మధ్య స్నేహం బాగుంది అంటారు.. కానీ ఈ నిర్ణయాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఎప్పుడేం చేస్తారో ఆయన మిత్రుడు మోడీకి బాగా తెలుసు. దీనిపై మోడీ స్పందించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.






