Sridhar Babu: మా వాటా మాకు రావాలె.. బడ్జెట్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పందించారు.

Sridhar Babu: మా వాటా మాకు రావాలె.. బడ్జెట్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ శనివారం (Union Budget 2025) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణను విస్మరించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు రావలసిన వాటా మాకు రావాలె అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

నేడు భారత్‌లో (GDP) జీడీపీకి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఇతర రాష్ట్రాలకు ఎక్కువ, తక్కువ ఇచ్చారు అని ఇక్కడి ప్రజలు అనుకోకుండా బీజేపీ నాయకులు నిధులు తేవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మాకు కేటాయించాలని, అలాగే నిధులు తెలంగాణకు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Next Story