- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైపాల్ రెడ్డి ఉన్నప్పుడే మెట్రో మంజూరైంది.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వంలో జైపాల్ రెడ్డి ఉన్నప్పుడే హైదరాబాద్‌కు మెట్రో మంజూరైందని గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేగంగా మెట్రో పనులు చేశాం.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలోనే మెట్రో విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో విస్తరణ విషయంలో కదలిక లేదని విమర్శించారు. మెట్రో విస్తరణ కోసం ఇప్పటికే కేంద్రానికి డీపీఆర్‌లు పంపించామని తెలిపారు. కేంద్రం నుంచి అతి త్వరలోనే అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం వద్దకు ఎన్ని సార్లు అయినా వెళ్తామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. మెట్రో రైలు రెండో దశ(బీ) నిర్మాణ ప్రాజెక్ట్‌కు ఇటీవలే ముందడుగు పడిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కారు రూ.19,579 కోట్లతో 81.6 కిలో మీటర్ల మేర మూడు కారిడార్లకు పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. కారిడార్ 9లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్యూచర్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలో మీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు 22 కిలో మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నారు.






