CM రేవంత్‌ది ముక్కుసూటి మనస్తత్వం.. మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది ముక్కుసూటి మనస్తత్వమని.. ఏ విషయాన్నైనా ఆయన ఉన్నది ఉన్నట్లే చెబుతారని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.

CM రేవంత్‌ది ముక్కుసూటి మనస్తత్వం.. మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది ముక్కుసూటి మనస్తత్వమని.. ఏ విషయాన్నైనా ఆయన ఉన్నది ఉన్నట్లే చెబుతారని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నదని.. అది వాడినా, వాడకపోయినా అద్దె చెల్లించాల్సిందే అని చెప్పారు. అయినా మంత్రులు హెలికాప్టర్(Helicopter) వాడితే తప్పేంటని ప్రశ్నించారు. హెలికాప్టర్ వాడటం వల్ల పనుల్లో వేగం పెరుగుతుందని.. ఒకేసారి నాలుగైదు పనులు జరుగుతాయని అన్నారు. గత ప్రభుత్వం చాపర్‌కు అద్దె చెల్లించింది కానీ వాడలేదని గుర్తుచేశారు.

ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నా చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీ(BJP) నేతలు విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్(BRS) నేతలు వెలగబెట్టింది ఏమీ లేదని అన్నారు. కుటుంబం మొత్తం కలిసి రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నదని ఆరోపించారు. మరోవైపు కేంద్రం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. పెహల్గాం ఉగ్రదాడికి కారణం కేంద్రం వైఫల్యమే అని అన్నారు. బీజేపీ దేశాన్ని పాలించడం చేతగాకపోతే దిగిపోవాలని సూచించారు. దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story