- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ.. మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
బీఏసీ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఏసీ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజు కాళేశ్వరం నివేదికను సభ ముందు పెట్టి చర్చ చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో నివేదికపై చర్చ జరగనున్నదన్నారు. కాళేశ్వరం నివేదికపై షార్ట్ డిస్కషన్ అనంతరం బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద కూడా సభలో చర్చిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వర్షాలు, వరదలు సమస్యలు తీవ్రంగా ఉన్నందున, అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజులు సభకు బ్రేక్ ఇచ్చి సభను నడుపుతామన్నారు. గణేష్ నిమజ్జనం, వరదల నేపథ్యంలో మధ్యలో బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. అజారుద్దీన్(Mohammad Azharuddin)కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం మంచి నిర్ణయమని, అంతర్జాతీయ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలున్న అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ పదవికి పేరు ప్రతిపాదించడం సంతోషకరమైన అంశమన్నారు.






