బీఆర్ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చర్చలో భాగంగా బీజేపీపై మాట్లాడాల్సి వస్తుందని బీఆర్ఎస్ భయపడి సభ నుంచి పారిపోయిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

బీఆర్ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్‌కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చర్చలో భాగంగా బీజేపీపై మాట్లాడాల్సి వస్తుందని బీఆర్ఎస్ భయపడి సభ నుంచి పారిపోయిందని విమర్శించారు. సభ 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేసినవారు.. ఒకరోజుకే ఎందుకు పారిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. ఇరిగేషన్‌పై డిస్కషన్‌కు వాళ్ళే సిద్ధం అన్నారు.. ఇప్పుడు ఎందుకు పారిపోయారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

ఇంకా నిర్ణయించలేదు..

అంతకుముందు.. మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని శ్రీధర్‌ బాబు తెలిపారు. అసెంబ్లీలో పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లుపై చర్చలో శ్రీధర్‌ బాబు మాట్లాడారు. జీహెచ్‌ఎంసీలో పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. హైదరాబాద్‌ను మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ విలీనం. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని అడిగారు.

Next Story