- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఈడీ వారికి గుడ్‌న్యూస్.. టీ సాట్‌లో ఎడ్‌సెట్ డిజిటల్ కంటెంట్
టీ సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీ సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టీ సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రసారాల వివరాలు తెలిపే షెడ్యూల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ, ఎడ్ సెట్ లో ఉన్నతమైన ర్యాంకులు సాధించేందుకు టీ-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా బీఈడీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
టీ-సాట్ కంటెంట్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా అందుబాటులో ఉంటుందని, తద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకు టీ-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, మే నెలలో జరిగే ఎడ్ సెట్ పరీక్ష కోసం అభ్యర్థులను సిద్ధం చేసేందుకు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు రోజుకు నాలుగు గంటల పాటు 392 ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నామన్నారు. బయాలజీ, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులతో 98 రోజుల పాటు టీ-సాట్ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు టీ-సాట్ యాప్, యూట్యూబ్ లో ప్రసారాలు కొనసాగుతాయన్నారు. పోటీ పరీక్షలకు డిజిటల్ కంటెంట్ అందించేందుకు కృషి చేస్తున్న సీఈవో వేణుగోపాల్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.





