Minister Sridhar Babu: ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు

by Gantepaka Srikanth |

డ్రగ్ రెసిస్టెంట్ క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని.. వైద్య ఆరోగ్య వ్యవస్థలకు ఔషధాలకు లొంగని ప్రాణాంతక క్షయవ్యాధి పెను సవాలుగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Minister Sridhar Babu: ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్ రెసిస్టెంట్ క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని.. వైద్య ఆరోగ్య వ్యవస్థలకు ఔషధాలకు లొంగని ప్రాణాంతక క్షయవ్యాధి పెను సవాలుగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. మంగళవారం శాసనసభ కమిటీ హాల్‌లో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో తయారైన డ్రగ్ రెసిస్టెంట్ క్షయ వ్యాధి కిట్లను ఆవిష్కరించారు. ఫ్రెంచ్ డయాగ్నటిక్స్ దిగ్గజం బయోమెరియో ఈ కిట్ల ఉత్పత్తిని ప్రారంభించింది.

బెంగళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ, ఆరోగ్య, సామాజిక వ్యవహారాల కౌన్సిలర్ చార్ల్స్ మహీ, బయోమెరియో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెగ్జాండర్ మెరియో ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీబీ వ్యాధి నిర్మూలన దిశగా దేశం చేసున్న ప్రయత్నాలకు సహకరిస్తున్న బయోమెరియో యాజమాన్యాన్ని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేశ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండో ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ రూపొందించిన రెండు దేశాల వాణిజ్య సంబంధాల నివేదికను కాన్సుల్ జనరల్ మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేశారు.

Next Story