డ్రైవర్ రహిత కారులో ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు

by M.Rajitha |   ( Updated:2024-08-26 11:58:48.0  )
డ్రైవర్ రహిత కారులో ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించారు. ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి, ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా డ్రైవర్ లెస్ కారును తయారు చేసిన విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు. హైదరాబాద్ ఐఐటీ దేశానికే తలమానికం అని శ్రీధర్ బాబు కొనియాడారు. ప్రయోగ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే ఆచారణలోకి రావాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఐఐటీ విద్యార్థులు అన్ని రంగాలలో ఏఐ సాంకేతికతను తీసుకు రావాలని మంత్రి సూచించారు. దేశానికి ఐఐటీలను అందించిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపిన శ్రీధర్ బాబు, నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఈ విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేశాడని అన్నారు. హైదరాబాద్ కు ఐటీ ఇండస్ట్రీని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

Advertisement

Next Story