- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి: కేంద్ర మంత్రికి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు కేంద్రం మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని ‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్ గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ (Gajendrasingh Shekawat) ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు ఇవాళ గజేంద్రసింగ్ షేకావత్ ను కలిశారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం (Kaleswara Mukteshwara Temple), రామగిరి కోటను (Ramagiri Fort) టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి వేయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని ఈ ఏడాది మే నెలలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామని వివరించారు. 2027లోనూ ఇక్కడే గోదావరి పుష్కరాలు జరగనున్నాయని ఆ సమయంలో కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశముందన్నారు. సోమ్ నాథ్, కేదార్ నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీల మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాం. దీని అమలుకు కేంద్రం సహకరించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం పుష్కరాలు మొదలయ్యే నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇక రామగిరి కోటకు సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉందని రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉందన్నారు. రాముడి ఆలయాలు, జలపాతాలు, ఎన్నో ఔషధ మొక్కలతో కూడిన ఈ ప్రాంతానికి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని ఆకర్షణలు ఉన్నాయని అందుల్ల స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.






