Sridhar Babu: ఏది పడితే అది మాట్లాడితే కుదరదు.. లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-08-03 12:47:20  IST  )

లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

Sridhar Babu: ఏది పడితే అది మాట్లాడితే కుదరదు.. లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కామెంట్స్ కు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) కౌంటర్ ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో నికర, మిగులు, వరద జలాలు వాటా తేలకముందే బనకచర్ల కడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాష్ట్ర వాటాలను త్వరలో తేల్చమని తాము కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తాము అడ్డుకోలేదని ఇప్పుడు వృథాగా పోతున్న నీటిని ఉపయోగించుకుంటామంటే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గోదావరిలో తెలంగాణకు ఉన్న కేటాయింపుల మేరకు మేము ప్రతిపాదనలు చేసుకుంటున్నామని మా వాటాలో మేము ప్రాజెక్టులు కట్టుకుంటే ఆపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్టు ఉందని ఏది చేసినా చెల్లుతుందనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మాకు

మా రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం:

మా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు కుంగిపోవడం బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. ఇంజినీర్లకు బదులు టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ప్రణాళికలతోనే ఇలా జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకే బ్యారేజీల విషయంలో ముందుకు వెళ్తున్నామన్నారు.

Next Story