- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
దిశ వెబ్ డెస్క్ : ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. అతి తెలివి మంత్రి గారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని..బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేశారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చమని చురకలేశారు. ముందు మీరు మీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు చక్కదిద్దుకోండని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వివాదాన్ని మా పార్టీపై వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేనని, ప్రాంతాలకు అతీతంగా వారందరినీ గౌరవిస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుతామని శ్రీధర్ బాబు అన్నారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ మరింత పెంచడానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు.