- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామరాజ్యం పేరుతో రౌడీయిజం క్షమించరాని నేరం.. మంత్రి శ్రీధర్ బాబు సీరియస్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan)పై దాడి జరుగడాన్ని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్(Rangarajan)పై దాడి జరుగడాన్ని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తీవ్రంగా ఖండించారు. సోమవారం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మరియు నిర్వాహకులు అయిన రంగరాజన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది హేయమైన చర్య అని సీరియస్ అయ్యారు. రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక, అనాగరిక కార్యక్రమాలకు పాల్పడటం దుర్మార్గ అని అన్నారు. ఇది క్షమించరాని నేరం అని.. అంతేకాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్యగా పేర్కొన్నారు.
కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు.. ఇలాంటి వారి పట్ల పోలీసులు, ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అమానుషం అని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. మొత్తం 20 మంది దాడి చేసినట్లు ఆరోపణలు రాగా.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.






