- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వివేక్‌పై మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్
మైనింగ్ మంత్రి వివేక్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మైనింగ్ మంత్రి వివేక్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు. రాఘవ క్రషర్ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నిలదీయడంతో.. ఆయనకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రి వివేక్ ఫెయిల్ అయ్యారు. ఎలాంటి లెక్కలు లేకుండా.. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పక్కనే ఉన్న అధికారుల లాబీ వద్ద ఈ ఘటన కనిపించింది. ఆ తరువాత అధికారుల నుంచి సమాచారం తీసుకొని శ్రీధర్‌బాబు రిప్లై ఇచ్చారు.
నోటీసులపై సమాచారం లేదు..
మరోవైపు.. హరీశ్‌రావు అన్ని ఆధారాలతో సహా రాఘవ క్రషర్ వ్యాపారాన్ని వెలుగులోకి తీసుకురాగా.. మైనింగ్ మంత్రి అయిన వివేక్ మాత్రం సరైన సమాధానం ఇవ్వడంలో వెనుకబడిపోయారు. అంతేకాకుండా.. క్రషర్ సంస్థకు మైనింగ్ అధికారులు స్వయంగా నోటీసులు జారీ చేశారని హరీశ్‌రావు వెల్లడించినా.. అసలు నోటీసుల అంశం తనకు తెలియదంటూ సభ సాక్షిగా వివేక్ చెప్పడం మిగితా మంత్రుల్లో మరింత ఆగ్రహం తెప్పించింది. ఎలాంటి వివరాలు లేకుండా మాట్లాడడంపైనే శ్రీధర్ బాబు ఆయనకు క్లాస్ తీసుకున్నారు.






