- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: హైదరాబాద్ ఇకపై కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాదు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‍లో కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‍ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఇకపై కేవలం టెక్నాలజీ హబ్‍గా మాత్రమే కాకుండా భద్రమైన, బాధ్యతాయుతమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా (AI Innovation Center) మారుతోందని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఏఐ కమాండ్ సెంటర్‍గా, ప్రపంచ ఉత్పత్తులు రూపొందే స్థలంగా మారబోతోందన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‍ను (Kovacent AI Center) మంత్రి ప్రారంభించారు. 500 మంది ఏఐ ఇంజనీర్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ సెంటర్.. 2028 నాటికి 3000 మంది ఏఐ ఇంజనీర్లకు వేగంగా విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు కృత్రిమ మేథస్సు యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయని చెప్పారు. అయితే హైదరాబాద్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందని ఇక్కడ మేము లోతైన సామర్థ్యం, దీర్ఘకాల దృష్టిపై ఆధారపడి నాయకత్వాన్ని నిర్మిస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరంలో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ సెంటర్ల పెరుగుదలతో పాటు ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీలో ప్రత్యేక పాత్రలు విస్తరిస్తాయని చెప్పారు. కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఈ వేగాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. తద్వారా గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎంటర్ప్రైజ్ స్థాయి ఏఐ డెవలప్మెంట్‍ను ఒకే ఎకోసిస్టమ్ లోకి తీసుకొస్తుందన్నారు.






