- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాసనసభను ఎందుకు చులకన చేస్తున్నారు? మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం
బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న నదీ జలాల విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు వాళ్లు సభకు రాకపోవడం బాధకరం అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న నదీ జలాల విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు వాళ్లు సభకు రాకపోవడం బాధకరం అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ప్రయత్నం చేసేందుకు రాకపోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైందే సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అని చెప్పారు. ఈ రోజు ఇరిగేషన్ మంత్రి నదీ జాలాల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు ఉన్న అనుమానాలకు సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారన్నారు. మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఇంత ప్రాధాన్యత గల అంశంపై చర్చించేందుకు రాలేదని.. శాసనసభను ఎందుకు చులకన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉందని అన్నారు.






