- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పగలే చుక్కలు కనిపిస్తున్నాయా?.. కేటీఆర్‌పై శ్రీధర్ బాబు సెటైర్
ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కేటీఆర్(KTR) ఆలోచనల్లో మార్పు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కేటీఆర్(KTR) ఆలోచనల్లో మార్పు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మండిపడ్డారు. శుక్రవారం సచివాయంలో శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఆర్థిక ఆరాచకానికి పాల్పడిందని ఆరోపించారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ అవస్తవాలు చెప్పారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కావాలనే కుట్రపూరితంగా కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫాక్ట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కేటీఆర్ చెప్పే 30శాతం భూమి విలువ కాదు.. కేవలం కన్వర్శన్ ఫీజు మాత్రమే.. ఫ్రీ హోల్డ్‌కు.. లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని శ్రీధర్ బాబు విమర్శించారు.
గత ప్రభుత్వంలో తెచ్చిన జీవోలను ఇప్పుడు తాము అమలు చేస్తున్నాము.. కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు.. కన్వర్శన్‌కు.. భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్శన్ చేశారు.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా గులాబీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. కేటీఆర్ చెప్పిన పేరు కలిగిన వాళ్ళు MOU చేసుకున్నట్లు నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు.. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ అవ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. సొంత భూములు ఉన్న వాళ్ళు కన్వర్శన్ చేసుకోవచ్చు.. కేటీఆర్ గాలి మాటలు నమ్మొద్దని సూచించారు.






