భూ స్కాం ఆరోపణలు: హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-22 14:27:40  IST  )

తెలంగాణలో భూస్కాం ఆరోపణలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది.

భూ స్కాం ఆరోపణలు: హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భూ స్కాం ఆరోపణల (Land scam allegations)తో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం చేస్తుందని కేటీఆర్ చేసిన ఆరోరపణలపై హరీష్ రావు (Harish Rao) ఈ రోజు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ల్యాండ్ స్కాం (Huge land scam) చేయాలని చూస్తోందని, రూ.5 లక్షల కోట్ల విలువ గల 9,298 ఎకరాల భూములను తక్కువ ధరకే అమ్మకానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) చెప్పిన 4,740 ఎకరాలే నిజమని ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవేనని చెప్పిన హరీశ్ రావు, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

కాగా ఈ ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వ భూములనూ అమ్మకానికి పెట్టలేదని, హరీశ్ రావు చేస్తున్న విమర్శలు వాస్తవాలను వక్రీకరించడం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పథకాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేయడం కేటీఆర్–హరీశ్‌కి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు.

Next Story