- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Seethakka: మీరే చొరవ తీసుకోవాలి.. నితిన్ గడ్కరీకి మంత్రి సీతక్క రిక్వెస్ట్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి మంత్రి సీతక్క రిక్వెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా అని దళితులు, ఆదివాసులు ఎక్కువ మంది జీవిస్తున్న ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు లేకవపోవడం వల్ల పేదరికం ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీతక్క రోడ్ల అనుసందానం అభివృద్ధికి కీలకమని అందువల్ల ఎలాంటి వివక్ష లేకుండా రోడ్ల అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అటవీ అనుమతులు లేకపోవడంతో చాలా అటవీ ప్రాంత పల్లెలకు రోడ్ల కనెక్టివిటీలో జాప్యం జరుగుతోందని అందువల్ల వీటికి త్వరగా అనుమతులు వచ్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read More: Bandi Sanjay: మంత్రి కోమటిరెడ్డి భోళా మనిషి.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు






