Bandi Sanjay: మంత్రి కోమటి‌‌రెడ్డి భోళా మనిషి.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-05 06:56:41  IST  )

మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) భోళా మనిషి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కామెంట్ చేశారు.

Bandi Sanjay: మంత్రి కోమటి‌‌రెడ్డి భోళా మనిషి.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) ఓ భోళా మనిషి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కామెంట్ చేశారు. ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) పర్యటిస్తున్నారు. జిల్లాలో రూ.3,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర బండి సంజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చాక జిల్లా రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని అన్నారు.

2014కు ముందు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 2,500 కి.మీ. మాత్రమే ఉండేదని.. గత పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5,100 కి.మీలకు చేరిందని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం రూ.1.25 లక్షల కోట్లు కేటాయించిందని అన్నారు. రోడ్ల అభివృద్ధి పనుల కోసం తెలంగాణ (Telangana) నుంచి ఏ ఎంపీ అయినా.. పార్టీలతో సంబంధం లేకుండా మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళితే క్షణాల్లో పని అవుతుందని అన్నారు. మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఓ మంచి మంత్రి అని.. ఆయన భోళా మనిషి అంటూ కామెంట్ చేశారు. తన మనసులో ఎలాంటి విద్వేషాలు ఉండవని.. ఏది ఉన్నా ఓపెన్‌గా చెప్పే మనస్తత్వమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల్లా కలిసి పనిచేస్తే.. దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని బండి సంజయ్ అన్నారు.

Read More: Kishan Reddy: దేశంలో కనెక్టివిటీ పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story