- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shridhar Babu: 'ఎన్ఎక్స్ పీ' సెమీ కండర్టర్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
తెలంగాణలో ఆర్ అండ్ డీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ సిటీలో (AI Cty) భాగస్వామ్యం కావాలని 'ఎన్ ఎక్స్ పీ' సెమీ కండర్టర్స్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు (Shridhar Babu) కోరారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో గురువారం 'ఎన్ ఎక్స్ పీ' సెమీ కండర్టర్స్ (NXP Semiconductors) ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలంగాణలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వామ్యం కావడంతో పాటు, సెమీ కండక్టర్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయాలని కోరారు. సెమీ కండక్టర్స్ తయారీకి సంబంధించిన ఆర్ అండ్ డీ (R&D) యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేయాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.






