దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం: మంత్రి సీతక్క హెచ్చరిక

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో మంత్రి సీతక్క(Minister Sitakka) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం: మంత్రి సీతక్క హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో మంత్రి సీతక్క(Minister Sitakka) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ఆమె బాధ్యతలు అప్పగించిన బోరబండ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్(BRS) అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోని రౌడీ షీటర్లంతా ఇప్పుడు మంచోళ్లు అయ్యారా? అని సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌(Naveen Yadav)ను పదే పదే రౌడీ షీటర్ అనడం కరెక్ట్ కాదని అన్నారు. నవీన్ యాదవ్ పక్కా లోకల్ వ్యక్తి.. ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో.. రెండేళ్లలో తామేం చేశామో ప్రజలకు తెలుసని అన్నారు. మరోసారి మా కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అంటే ఊరుకునే ప్రసక్తే లేదు.. దంచికొడతామని సీతక్క హెచ్చరించారు. మరోవైపు జూబ్లీహిల్స్​ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్​పార్టీ(Congress Party) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఇప్పటికే మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తుండగా.. తాజాగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​యాదవ్‌పైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజలకు వివరించనున్నారు.

Next Story