Seethakka: అభివృద్ధికి అడుగులు.. అడవిలో మంత్రి సీతక్క!

by Ramesh Naini |   (  Updated:2025-07-12 12:55:35  IST  )

ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలోని వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని శనివారం మంత్రి సీతక్క స్వయంగా సందర్శించారు.

Seethakka: అభివృద్ధికి అడుగులు.. అడవిలో మంత్రి సీతక్క!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అభివృద్ధికి అడుగులు వేస్తూ.. అడవులకు దగ్గర గ్రామాల్లో మంత్రి సీతక్క పర్యటన చేస్తున్నారు. ఏటూరు నాగారం (Eturnagaram) మండలం కొండాయి గ్రామంలోని వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని శనివారం మంత్రి సీతక్క (Minister Seethakka) స్వయంగా సందర్శించారు. రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆమె దగ్గరుండి పరిశీలించారు. ఇందులో భాగంగా పనుల వేగాన్ని పెంచాలని అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ తో కలిసి బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని తిలకించిన మంత్రి, తక్కువ సమయంలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అదే సందర్భంలో, వాగును దాటి ట్రాక్టర్‌పై ప్రయాణించి అవతలి వైపునకు చేరుకున్న మంత్రి సీతక్క, ఇటీవల నిర్మితమైన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలతో కలిసి మంత్రి, కలెక్టర్, అధికారులు భోజనం చేశారు. హోదాని పక్కన పెట్టి, అన్ని ఆటంకాలను అధిగమిస్తూ ములుగు అభివృద్ధిలో ప్రత్యేకతను మంత్రి సీతక్క చాటుకుంటున్నారు.

Next Story