- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు తరహాలో మహిళా పోలీస్‌లకు యూనిఫార్మ్ ఉండాలి: సీతక్క కీలక సూచనలు
బుధవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ మహిళా పోలీస్ తొలి సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై ప్రసంగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కమిట్మెంట్, కాన్ఫిడెన్స్‌కు చిరునామా మహిళా పోలీసులు అని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో (Telangana Women Police Conference) తెలంగాణ మహిళా పోలీస్ తొలి సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై ప్రసంగించారు. మహిళా పోలీసుల సంక్షమం పట్ల ఒక కమిట్మెంట్‌గా ఈ సదస్సు నిలుస్తోందన్నారు. మహిళా శక్తినీ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హోమ్ మినిస్టర్‌గా ఉన్నారని కొనియాడారు. ఈ సదస్సులో మీరు ఇచ్చే సలహాలు సూచనలకు అనుగుణంగా మీ సంక్షేమం కోసం సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ దేశంలో మహిళా పోలీస్ సింగ్‌కు ఇందిరా గాంధీ పునాదులు వేశారని, 1973లో కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో తొలి మహిళా పోలీస్ స్టేషన్ను ఇందిరా గాంధీ ప్రారంభించారని గుర్తుకుచేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు అయ్యాయని వివరించారు.
వృత్తి ధర్మం, మాతృత్వం మధ్య మహిళా పోలీసులు సంఘర్షణలు ఎదుర్కొంటారని తెలిపారు. కాబట్టి మెటర్నిటీలో ఉన్న మహిళా పోలీసులకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. మహిళలకు కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి కాబట్టి.. వాటి దృష్టిలో పోలీస్ శాఖ మహిళలా పోలీసులకు అండగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చే బాధితులకు భరోసాగా మహిళా పోలీసులు నిలవాలని సూచించారు. ప్రతి ఏడాది పోలీసులందరికీ జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీసులకు వీక్లీ ఆఫ్, ప్రత్యేక పని వేళల సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. మహిళా పోలీసుల ప్రత్యేక అవసరాలపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తే చట్టాలు చేస్తామని హామీ ఇచ్చారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ హరాస్మెంట్ వంటి కేసులలో మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్, కౌన్సెలింగ్ ప్రోగ్రాములు మహిళా పోలీసుల కోసం తప్పనిసరిగా ఉండాలన్నారు. మెటర్నిటీ, పోస్ట్-డెలివరి కాలానికి అనువుగా తమిళనాడు తరహాలో ప్రత్యేక యూనిఫార్మ్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో మహిళా పోలీసుల కోసం ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను స్టడీ చేసి నివేదిక ఇస్తే వాటిని అమలు పరుస్తామన్నారు.
మహిళా పోలీసులకు అవసరమైన రెస్ట్ రూములు, వెల్నెస్ సెంటర్లను నెలకొల్పాలన్నారు. రాష్ట్రంలో 80 వేల మంది పోలీసులు ఉంటే.. అందులో మహిళా పోలీసులు కేవలం 7 వేల మంది మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా పోలీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీస్ ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లను అధిగమించేలా ఈ సదస్సు ఉపయోగపడుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ పోలీస్ అధికారులు అభిలాష బిస్త్, చారు సిన్హా, షికా గోయల్, స్వాతి లక్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు 400 మంది మహిళా పోలీస్ అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.






