Seethakka: డీజే టిల్లు పాట‌కు మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు.. వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-01-25 08:57:55  IST  )

రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3k రన్ ఘనంగా నిర్వహించారు.

Seethakka: డీజే టిల్లు పాట‌కు మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (National Road Safety Festival) రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ములుగులో 3k రన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ 3K ర‌న్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క (Seethakka) హాజరయ్యారు. ఈ సందర్భంగా (DJ Tillu) డీజే టిల్లు సినిమా పాటకు మంత్రి సీతక్క డ్యాన్స్ చేసి.. అక్క‌డున్న యువతీ యువ‌కుల్లో జోష్ నింపారు. సీత‌క్క డ్యాన్స్‌కు ఫిదా అయిన యువకులు ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో అభినందించారు. నిత్యం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండే మంత్రి.. విద్యార్థులు, యవకులతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story