- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్‌కు పరిస్థితి వివరించి వైదొలుగుతా.. మంత్రి సీతక్క సంచలన నిర్ణయం
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ లోక్‌సభ(Adilabad Lok Sabha) నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క(Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ లోక్‌సభ(Adilabad Lok Sabha) నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క(Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరు బాగోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆదిలాబాద్ బాధ్యతల(Adilabad Congress in-charge) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి.. పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి తప్పుకుంటా అని మంత్రి సీతక్క సంచలన ప్రకటన చేశారు. ప్రకటించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ వేద్దామని మీనాక్షి నటరాజన్ ప్రపోజల్ పెట్టారు. మరోవైపు అంతకుముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సీతక్క సీరియస్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో మల్లన్న(Teenmar Mallanna) ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కులగణనపై అభ్యంతరాలు ఉంటే శాసనమండలితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అభిప్రాయం చెప్పాలి కానీ.. ఇష్టానుసారం మాట్లాడి ప్రభుత్వ(Congress Government) ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని తాము చేసి చూపించామని అన్నారు. తమను అభినందించాల్సింది పోయి.. విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని.. బీసీ వర్గాలను అణచిపెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము అని తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.






