మేం రివర్స్‌లోనే పూజిస్తాం.. దయచేసి వివాదం చేయకండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

మేం రివర్స్‌లోనే పూజిస్తాం.. దయచేసి వివాదం చేయకండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి

మేం రివర్స్‌లోనే పూజిస్తాం.. దయచేసి వివాదం చేయకండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: స్వస్తిక్‌ గుర్తు(Swastika Symbol)ను విశ్వానికి చిహ్నంగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. హిందూ పురాణాల ప్రకారం.. స్వస్తిక్‌కు మతపరంగా ప్రాముఖ్యత ఉంది. స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్‌ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు. దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుందని నమ్ముతారు. అయితే.. మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌లో వేశారు. తాజాగా ఇది వివాదాస్పదం కావడంతో మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించి వివరణ ఇచ్చారు. స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు.. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే పూజిస్తాం.. రివర్స్ స్వస్తిక్ శతాబ్దాలుగా మాకు ఆచారంగా వచ్చింది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి అని సీతక్క విజ్ఞప్తి చేశారు. కాగా, వచ్చే ఏడాది మేడారం మహాజాతర జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మంగళవారం మేడారం జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. తొలుత వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వారు దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Next Story