- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలపై నుంచి కింద పడ్డా కూరగాయల బతుకమ్మ.. వైరల్ వీడియోపై మంత్రి సీతక్క రియాక్షన్
ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క కూరగాయలతో పేర్చిన బతుకమ్మను నెత్తిమీద పెట్టుకుని సభా వేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క (Minister Seethakka) కూరగాయలతో పేర్చిన బతుకమ్మను నెత్తిమీద పెట్టుకుని సభా వేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా (bathukamma) బతుకమ్మ కింద పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అపచారం జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ పెట్టారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. శుక్రవారం తన నియోజకవర్గం ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి (BRS) బీఆర్ఎస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘కూరగాయల బుట్ట కింద పడితే కూడా మైండ్ లేకుండా బీఆర్ఎస్ నేతలు కొందరు ఏదో అపచారము జరిగిందని ప్రచారం చేస్తున్నారు. దాన్ని పట్టుకొని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు (viral) వైరల్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి మైండ్ ఉందా? నేను దొరసానిని కాదు. నేను మంత్రిని అయినా ప్రజల మధ్య ఉంటాను. నా చుట్టూ పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. అందులో ఒక మహిళ పొరపాటుగా కూరగాయల పేర్చిన బతుకమ్మను తగిలితే అవి కింద పడ్డాయి. దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం ఏం సంస్కారం? మహిళా సంఘాలకు రూ. 3000 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టిన బీఆర్ఎస్, ఇందిరా మహిళా శక్తి సంబరాలను చూసి ఓర్వలేక పోతుంది. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది’ అని మంత్రి సీతక్క అన్నారు.






