Seethakka: ఉపాధి హామీ కూలీలు మృతి.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

by Ramesh Naini |

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హ‌మీ ప‌నుల్లో జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెంద‌డం ప‌ట్ల‌ మంత్రి సీత‌క్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

Seethakka: ఉపాధి హామీ కూలీలు మృతి.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సిద్దిపేట (Siddipeta) జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హ‌మీ ప‌నుల్లో జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెంద‌డం ప‌ట్ల‌ (Minister Seethakka) మంత్రి సీత‌క్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘ‌ట‌న వార్త తెలిసిన వెంట‌నే జిల్లా డీఆర్డీఓ ను ఘ‌ట‌న స్థ‌లానికి పంపించారు. జ‌రిగిన ప్ర‌మాదం పై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడిన సీత‌క్క వివ‌రాలు తెప్పించుకున్నారు. ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ ఆ ప్రాంతంలో ప‌నులు చేయోద్ద‌ని జిల్లా అధికారులు వారం రోజుల క్రిత‌మే హెచ్చ‌రించినా.. ప‌నులు కొన‌సాగ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఘ‌ట‌న‌పై శాఖ అధికారుల‌తో స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు. ప్ర‌మాదంలో గాయపడిన మరో ఇద్దరికి మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు. మరణించిన, గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీత‌క్క హ‌మీ ఇచ్చారు. బాధిత కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని గ్రామీణాభివృద్ది శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా, గోవ‌ర్ధ‌న‌గిరి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు ఉపాధి హామీ ప‌నుల్లో భాగంగా గురువారం ఉదయం ప‌నులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మ‌ట్టి దిబ్బ కూలిపోయింది. ఈ మ‌ట్టి దిబ్బ‌ల కింద ప‌డి ఇద్ద‌రు కూలీలుప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంటనే స‌మాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జేసీబీ స‌హాయంతో శిథిలాల‌ను తొల‌గించి, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story