- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Seethakka: మనల్ని హేళన చేసినోళ్లే.. నేడు మన ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కొమరం భీం ఆదివాసీ భవన్(Adivasi Bhavan)లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కొమరం భీం ఆదివాసీ భవన్(Adivasi Bhavan)లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలపై మంత్రి సీతక్క(Minister Seethakka) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘మా ఆదివాసీ మహిళలతో కలిసి ఆడి, పాడటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆదివాసీ, గిరిజనులు మన అస్తిత్వం, మూలాలను మరచిపోకూడదు. ఒకప్పుడు చదువు లేదని, రాదని చెప్పిన స్థాయి నుంచి ఇప్పుడు ములుగు, అసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల ఆదివాసీ విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. మన ఆహారం గురించి తప్పుగా మాట్లాడినవారు ఉన్నారు. కానీ ఇప్పుడు స్టార్ హోటళ్లలో మన రొట్టె, అంబలి, సూప్‌లను ఆస్వాదిస్తున్నారు. ఆదివాసీ గిరిజనుల కోసం సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో చేస్తున్నారు. ఎస్టీ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచారు. ఎస్టీ రైతులకు సోలార్ పవర్ అందిస్తున్నారు. బడ్జెట్‌లో ట్రైబల్ శాఖకు 15 వేల కోట్లు కేటాయించారు’ అని ట్వీట్‌లో సీతక్క పేర్కొన్నారు.






