- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత బస్సు ప్రయాణంపై దుష్ప్రచారం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు అండగా ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమతో పంచుకోవచ్చని మంత్రి సీతక్క మహిళా ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తమ ప్రభుత్వం (Female employees) మహిళా ఉద్యోగులకు అండగా ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమతో పంచుకోవచ్చని మంత్రి సీతక్క (Minister Seethakka) మహిళా ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడే విధంగా మహిళా ఉద్యోగులు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులుగా ఎన్నికైన మహిళల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం సచివాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వ ఉద్యోగంలో రాణించడం ఒక పెద్ద సవాల్ అని అన్నారు. కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతలు రెండింటినీ ఏకకాలంలో సమర్థంగా నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులను ఆమె అభినందించారు. కుటుంబ భారం మోస్తూ, తమ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, భర్త సహకారం ఉన్న మహిళా ఉద్యోగులు అదృష్టవంతులని ఆమె పేర్కొన్నారు.
సమానత్వం, మహిళా సాధికారత పై దృష్టి
మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలని మంత్రి సీతక్క సూచించారు. "హౌ టు రెస్పెక్ట్ ఉమెన్" అనే అంశాన్ని పిల్లలకు బోధించడం ద్వారానే సమానత్వం సాకారమవుతుందని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు ఈ నెల 22న ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశానికి మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో లభించే అభిప్రాయాల ఆధారంగా నూతన విధానాన్ని రూపొందిస్తామని ఆమె వెల్లడించారు.
ఉచిత బస్సు ప్రయాణంపై దుష్ప్రచారం
మహిళలు ఐక్యంగా ఉంటే అద్భుతాలు సృష్టిస్తారని మంత్రి సీతక్క అన్నారు. అందుకే మహిళల ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంపై జరుగుతున్న దుష్ప్రచారం పురుషాహంకారానికి, భూస్వామ్య భావజాలానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాలు పెట్రోల్ బంకుల ఏర్పాటు ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాయని, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఇంకా పెద్ద సంఖ్యలో సచివాలయం మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.






